అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్( Nara Lokesh ) కు ఆ మద్య సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇక తాజా నేడు విచారణ కూడా చేపట్టింది.
ఈ కేసులో నారా లోకేశ్ ను ఏ14 ముద్దాయి గా గుర్తించింది సీఐడీ.కాగా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్కిల్ స్కామ్ లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
పలుమార్లు ఆయన పై విచారణ జరపడం, కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఉండడం.ఇలా జరుగుతూ వస్తోంది.
దీంతో చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక లోకేశ్ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.ఒకవేళ విచారణ పూర్తి అయిన తరువాత కస్టడీకి తీసుకునే ఉందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఎందుకంటే లోకేశ్ బయట ఉండే సాక్షాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే తదుపరి పరిణామాల దృష్ట్యా లోకేశ్ ను జైల్లో ఉండేందుకే సీఐడీ ముగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనేది కొందరి వాదన.
ఏపీ సీఐడీ జగన్ సర్కార్ అధీనంలో పని చేస్తోందని ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో లోకేశ్ కూడా అరెస్ట్ అవుతాడని వైసీపీ నేతలు తరచూ చెబుతూనే ఉన్నారు.కాగా కేవలం రింగ్ రోడ్ స్కామ్ మాత్రమే కాకుండా ఫైబర్ గ్రేడ్ స్కామ్( Fiber Grid Scam ) లో కూడా లోకేశ్ పేరు వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో కస్టడీకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.ఒకవేళ లోకేశ్ కూడా అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది.ప్రస్తుతం టీడీపీ అధినేతల పేర్లు మాత్రమే స్కామ్ ల విషయంలో వినిపిస్తుండగా.
ముందు రోజుల్లో టీడీపీ లోని కీలక నేతల పేర్లు కూడా బయటకు తీసుకోచ్చేందుకు ఏపీ సీఐడీ ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మొత్తానికి సీఐడీ ఉచ్చులో తెలుగు పార్టీ కొట్టుమిట్టాడుతోందని చెప్పవచ్చు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.