స్కిల్ డెవలప్ మెంట్ కేసు అభూత కల్పనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు.
తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడమని బాలయ్య తెలిపారు.సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు.
పదేళ్ల నుంచి జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి గురించి జగన్ కు ఆలోచన లేదని విమర్శించారు.
అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదన్న బాలయ్య ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదన్నారు.జరగని పనులకు కేసులు పెట్టడం హాస్యాస్పదమని వెల్లడించారు.