ప్రమాదం. చూసేందుకు నాలుగక్షరాల పదమే అయినా కానీ ఇది చేసే డ్యామేజ్ మాత్రం లెక్కేయడానికి చాలా భయంకరంగా ఉంటుంది.కొన్ని కొన్ని ప్రమాదాలు కొంత మంది అనాధలను చేస్తాయి.వారికి ఎవరూ లేకుండా తుడిచిపెట్టుకుపోతారు.ఇలా రోజూ పొద్దున్న లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో రకాల ప్రమాదాలను గురించి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం.అయినా కానీ మనం మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటాం.
ప్రమాదాల తీవ్రత తక్కువగా ఉంటే జనాలు హ్యాపీ కానీ కొన్ని ప్రమాదాలు ఊహించేందుకు చాలా భయంకరంగా ఉంటాయి.కావున మనం వాహనాలు నడిపేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
కొన్ని కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగానే బండిని నడిపినా కానీ ఎదుటి వారి తప్పిదం వలన ప్రమాదాలు జరుగుతాయి.అటువంటి సందర్భాల్లో కూడా మనకు గాయాలు కాకుండా క్షేమంగా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
మన ప్రభుత్వాలు కూడా ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చాలా సందర్భాల్లో చెబుతుంది.అయినా కానీ ప్రభుత్వం చెప్పే దానిని చాలా మంది పెడచెవిన పెడతారు.
ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

హ్యాపీగా ఉన్న కుటుంబంలో విషాదాన్ని నింపుతారు.కుటుంబ సభ్యులు కోలుకోకుండా చేస్తారు.కావున ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం.
హిమాలయాల్లో రోడ్లు చాలా ఎత్తుమీద ఉంటాయి.కొండలకు ఆనుకుని ఉంటాయి.
ఆ రోడ్ల మీద ప్రయాణించాలంటే.మనం వాహనం నడపకున్నా వెనకాల కూర్చుంటేనే మనకు వణుకుతూ ఉంటుంది.
ఇక అటువంటిది వాహనం నడిపే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇరుగ్గా ఉన్న హిమాలయ రోడ్లలో ఒక బస్సు 80 అడుగుల లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో కొద్ది మందికి గాయాలయ్యాయి.







