మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర ప్రజలే చరిత్ర నిర్మాతలు అనీ ప్రజలే నిజమైన వీరులు అని వెలుగెత్తి చాటిన మార్క్సిస్టు మహోపాధ్యాయలు కార్ల మార్క్స్ విప్లవాలకు ఆది గురువు అని సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా నాయకులు అన్నారు.ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్ల మార్క్స్ 204 జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తన పెట్టుబడి గ్రంధం ద్వారా శ్రమ దోపిడీని ఎలుగెత్తి ఖండించి పెట్టుబడి అభివృద్దిలో “ అదనపు విలువ “సిద్దాంతం వెలికి తీసి శ్రమ శక్తి విలువను ప్రపంచం చాటిన మహనీయుడు అని , తన భార్యా పిల్లలు తిండిలేని పరిస్తితులలో అనారోగ్యానికి గురయి మరణించినా తాను నమ్మిన మార్గాన్ని వదలకుండా శ్రామికవర్గ లోకకల్యాణం కోసం పరితపించిన మహానీయుడని కార్ల్ మార్క్స్ అని అని వివరించారు నిర్బంధాలు , జైళ్ళు , లాఠీలు , ప్రాణ త్యాగాలు- ఆధునిక చరిత్రలో ఏ సిద్ధాంతం కోసం ప్రజలు చేయని అసమాన ప్రాణత్యాగాలు తన సిద్ధాంతం ద్వారా చేసేలా కార్మిక వర్గంలో చైతన్య నింపారని, కమ్యూనిష్టు ప్రణాళిక అనే మహత్తర ఆయుధాన్ని “ ఎంగెల్స్ తో కలసి శ్రామిక వర్గానికి అందించిన వాడు అని కొనియాడారు .శ్రామిక వర్గం కార్ల మార్క్స్ చూపిన బాటలో పయనీచి శ్రమ దోపిడీ నుంచి బయటపడి సమ సమాజాన్ని నిర్మించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాలేరు, ఖమ్మం పార్టీ డివిజన్ కార్యదర్శులు సి వై పుల్లయ్య, ఆవుల అశోక్, పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ప్రదీప్ చందు సురేష్ డి శ్రీనివాస్ ఆజాద్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
.






