"బ్రహ్మాస్త్రం" టీమ్ సినిమా ప్రచారంలో భాగంగా విశాఖపట్నం నగరాన్ని సందర్శించారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరక్కెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.

నేడు ఈ చిత్రబృందం విశాఖపట్నం సందర్శించి సినిమా విడుదల దిశగా ప్రయాణం ప్రారంభించింది.

రణబీర్, అయాన్ మరియు ఎస్.ఎస్.రాజమౌళి ప్రఖ్యాతి గాంచిన చారిత్రాత్మకమైన సింహాచలం దేవాలయం ను ముందు దర్శించుకుని ఆ తరువాత "ఐకానిక్ మెలోడీ థియేటర్‌" లో అభిమానులను కలిసి వాళ్ళతో కాసేపు ముచ్చటించారు.రాజమౌళి మాట్లాడుతూ :రణబీర్ కపూర్ అడిగారు ఈ సిటీ దేనికి ఫేమస్ అని.?నేను లవ్ బర్డ్స్ కి ఫేమస్ అని చెప్పాను.(నవ్వుతూ.)4 సంవత్సరాల క్రితం కరణ్ జోహార్ గారు ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను, మా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అని ఒకరున్నారు ఒక సారి ఈ కథ విన్నాక మీకు నచ్చితే మిమ్మల్ని సౌత్ ఇండియాలో ఈ సినిమాకి సమర్పకుడిగా అనుకుంటున్నాను అని చెప్పారు.ఆ తరువాత మొదటి సారి అయాన్ ను కలిసాను.

ఆయన కథ చెప్పిన విధానం కంటే ఆయన సినిమా మీద పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్నా ఎక్సయిట్మెంట్ కి నేను చాలా చాలా ఇంప్రెస్స్ అయ్యాను.ఆ తరువాత తను తయారుచేసుకున్న విజువల్స్ తన అప్పటివరకు షూట్ చేసిన మెటీరియల్ అంత చూపిస్తుంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను , ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అనే ఒక సినిమాని తయారుచేసాడు .ఈ సినిమాని నాకు 20 నిమిషాలే చూపించి, మా నాన్నగారికి మొత్తం చూపించాడు.ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి పెట్టుకున్నాడు అని నాన్నగారు చెప్పారు.

ట్రిపుల్ ఆర్ తర్వాత నేను రెండుసార్లు బొంబాయ్ కి వచ్చాను అయినా నాకు సినిమా మొత్తం చూపించలేదు.అయినా అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు అన్నట్లు, నాకు ఆ 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

స్క్రీన్ మీదే కాకుండా పర్సనల్ గా కూడా నాగార్జున గారు నాకు చాలా ఇష్టం అంటూ.అలానే అలియా భట్ గురించి ప్రస్తావిస్తూఆమె ఈ సినిమాలో ఉండటం దర్శకుడి అదృష్టం, రణబీర్ హృదయంలో ఉండటం రణబీర్ అదృష్టం అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ :ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది, దీనికి రెండు కారణాలు ఉన్నాయ్, నా రెండో సినిమా "యే జవానీ హై దీవానీ" 9 ఏళ్ళ క్రితం ఇదే రోజున రిలీజ్ అయింది.ఈ సినిమా కోసం నేను పదేళ్లు తీసుకున్నాను.

నేను చాలా పెద్దగా ఊహించాను, మునుపెన్నడూ తీయని ఒక గొప్ప సినిమాను తీయాలనే ఆలోచన నాకు ఉండేది, అప్పటికి రాజమౌళి సర్ ఇంకా బాహుబలి కూడా చెయ్యలేదు.ఇంత గొప్ప సినిమాను ఊహించేది నేను మాత్రమే అని ఫీల్ అయ్యేవాన్నీ.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే.వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఆలోచన నుంచి వచ్చిన చిత్రమే ఈ బ్రహ్మస్త్రం.చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి వాటి మూలాలు ఈ సినిమా బ్రహ్మస్త్రం సినిమాకి ఆధారం అని చెప్పుకొచ్చారు.

Advertisement

రణబీర్ కపూర్ టీంను ఉద్దేశించి మాట్లాడూతూ రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆ తరువాత అభిమానులతో ముచ్చటించారు.

తాజా వార్తలు