యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం తర్వాత ఏప్రిల్ 25వ తేదీ RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశ చెందుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన నటించిన RRRఈనెల 25వ తేదీ విడుదలైన తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఇప్పటికే పలు చిత్రాల ప్రకటన కూడా తెలియజేశారు.
ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన RRR ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఇకపోతే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాల కోసం ఏకంగా టాలీవుడ్ ముద్దుగుమ్మను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడానికి దాదాపు ఆలియాభట్ కన్ఫర్మ్ అయినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.
కొరటాల శివ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో పూజ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణంలోకి ఎన్టీఆర్ ఒక సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా ఏప్రిల్ 2వ వారంలో పూజా కార్యక్రమాలను ప్రారంభించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి తనయ జాన్వి కపూర్ నటిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ లెక్కన చూస్తే ఒకే నెలలో రెండు సినిమాల పనులను ప్రారంభించి ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లతో ఎన్టీఆర్ సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఆయన నటించిన RRR సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.