తెలంగాణలో అధికారం సాధించే విధంగా బీజేపీ రకరకాల ఎత్తుగడలకు దిగుతోంది.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ అనేక వ్యూహాలను రచిస్తోంది.
తెలంగాణ ప్రజలలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని గట్టెక్కాలని చూస్తోంది.క్షేత్ర స్థాయిలో టిఆర్ఎస్ బలంగా ఉండడంతో ఆ పార్టీని బలహీనం చేసి , బిజెపి ప్రభావం మరింత పెంచుకోవాలని చూస్తోంది .దీనిలో భాగంగానే టిఆర్ఎస్ లో ఉన్న నాయకులను, మంత్రులు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని వారు ఎన్నికల సమయం నాటికి బీజేపీలో చేరే విధంగా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.ప్రజాక్షేత్రంలో బలమైన నాయకులు గా గుర్తింపు పొందిన వారిని పెద్దఎత్తున బీజేపీలో చేర్చుకోవడం ద్వారా, టిఆర్ఎస్ పార్టీని బలహీనం చేయడంతోపాటు, బిజెపికి బలమైన పునాదులు వేయవచ్చు అనే ఆలోచనతో బిజెపి ఉన్నట్టుగా కనిపిస్తోంది.

అందుకే టిఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా అనేక ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది.ప్రస్తుతం బీజేపీని దెబ్బ కొట్టే విధంగా టిఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది ఢిల్లీ స్థాయిలో రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ తో పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతుండడం, ఇంకా అనేక ప్రజా సమస్యల విషయంలో బిజెపిని ఇరుకున పెట్టేలా కేసీఆర్ ప్లాన్ చేస్తుండడంతో , దానికి గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకుంది.అలాగే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక నాయకుల అవినీతి వ్యవహారాలను టార్గెట్ చేసుకుని ప్రజల్లోకి వారి అవినీతి వ్యవహారాలను తీసుకువెళ్లాలని బిజెపి ప్రయత్నిస్తోంది.
తెలంగాణలో రెండుసార్లు టిఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు కాబట్టి, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను రిక్వెస్ట్ చేయాలని బిజెపి భావిస్తోంది.
అలాగే పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరికలు ప్రోత్సహించడం ద్వారా, తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలంగాణలో అధికార పార్టీ గా మారవచ్చని బిజెపి లెక్కలు వేసుకుంటుంది.
అందుకే తమ పార్టీలోకి వచ్చేందుకు సముఖంగా ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాజీ మంత్రులను ఎన్నికల సమయం నాటికి పార్టీలో చేర్చుకుని మరింత బలోపేతం అయ్యి టీఆర్ఎస్ కి సవాల్ విసరాలని చూస్తోంది.