Waltair Veerayya Veerasimha Reddy : తెలుగు రెండు.. తమిళ్ రెండు.. చతుర్ముఖ పోటీలో విన్ అయ్యేది ఎవరు?

మన టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.ప్రతి ఏడాది లాగానే వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కూడా రసవత్తరమైన పోరు జరగనుంది.

 The Biggest Clash Of Tollywood For This Sankranti 2023,varasudu, Sankranthi, Wal-TeluguStop.com

మరి ఇప్పటికే ఈ బరిలో నాలుగు సినిమాలు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.నాలుగు కూడా పెద్ద సినిమాలే.

అందులో తెలుగు నుండి రెండు సినిమాలు అయితే తమిళ్ నుండి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.ఇలా నాలుగు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి అని తెలియడంతో చతుర్ముఖ పోటీలో ఎవరు విన్ అవుతారా అని ఫ్యాన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈసారి సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు.ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమా ‘వరిసు’, అజిత్ కుమార్ ‘తునివు’ కూడా రిలీజ్ కాబోతున్నాయి.

కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న ఈ ఇద్దరి నుండి సినిమాలు రాబోతున్నాయి అంటేనే అక్కడో రేంజ్ లో అంచనాలు పెరిగాయి.మరి మన తెలుగులో కూడా ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

దీంతో మన టాలీవుడ్ సీనియర్ హీరోల ఇద్దరితో తమిళ్ స్టార్స్ పోటీ పడబోతున్నారు.వాల్తేరు వీరయ్య సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.

Telugu Sankranthi, Sankranti, Biggestclash, Thunivu, Tollywood, Varasudu-Movie

ఈ రెండు సినిమాలను సంక్రాంతి బరిలో దింపుతున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది.దీంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.

అలాగే అజిత్ కుమార్ ‘తునివు’ కూడా రిలీజ్ కాబోతుంది.హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బోణీ కపూర్ నిర్మిస్తున్నారు.

ఇలా చతుర్ముఖ పోటీలో నెగ్గేది ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube