'ముందస్తు ' పైనే ఆ మూడు పార్టీల నమ్మకం ? జగన్ మాత్రం ..

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశమే లేదని, సాధారణ ఎన్నికలే జరుగుతాయని అధికార పార్టీ వైసిపి( YCP ) పదేపదే చెబుతున్న, ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ విషయాన్ని నమ్మడం లేదు.కచ్చితంగా జగన్( jagan ) ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నారని, డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అనుమానిస్తున్నారు.

 The Belief Of Those Three Parties On 'mundastu' Jagan Is , Bjp, Ysrcp, Tdp, Jana-TeluguStop.com

వర్షాకాల సమావేశాలు అనంతరం జులైలో జగన్ అసెంబ్లీని రద్దుచేసి ,డిసెంబర్ లో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో జరిగే  ఎన్నికలతో పాటు,  ఏపీలోనూ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని టిడిపి ,జనసేన ,బిజెపిలు భావిస్తున్నాయి.అందుకే జగన్ చేసిన ప్రకటనను నమ్మవద్దని టిడిపి ,జనసేన( TDP, Janasena ) తమ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నాయి.

ప్రత్యర్ధి పార్టీల దృష్టి మరల్చి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో జగన్ ఉన్నారని పార్టీ శ్రేణులకు చెబుతున్నాయి.

Telugu Ap, Chandrbabu, Jagan, Janasena, Pavan Kalyan, Ysrcp-Politics

 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పదేపదే సూచిస్తున్నాయి.ముందస్తు ఎన్నికలు వస్తాయన్న నమ్మకంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు.వారాహి యాత్రను ఆగస్టు నుంచి ప్రారంభించాలని ముందుగానే భావించినా, ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నుంచి తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

టిడిపి సైతం ముందస్తు ఎన్నికలపై నమ్మకం తో ఉంది.పార్టీ క్యాడర్ అంతా ముందస్తు ఎన్నికలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని  సూచిస్తుంది.మండలాలు, నియోజకవర్గల్లోని ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక తిరుపతి , విశాఖ లలో జరిగిన బిజెపి బహిరంగ సభల్లో బిజెపి జాతియ అధ్యక్షులు , కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ) వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేసిన నేపథ్యంలో, జనసేన, టిడిపిలు బిజెపి వైఖరిపై నిశితంగా పరిశీలన చేస్తున్నాయి.

Telugu Ap, Chandrbabu, Jagan, Janasena, Pavan Kalyan, Ysrcp-Politics

బిజెపి డబుల్ గేమ్ ఆడుతోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.ఏపీలో అధికార పార్టీకి సహకారం అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారా అనే విషయాలపై ఆరా తీస్తున్నాయి.అయితే బిజెపి మాత్రం తాము పూర్తిగా వైసిపికి వ్యతిరేకమేనని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.అయితే తమ ప్రత్యర్ధి పార్టీలు ఈ విధంగా ముందస్తు ఎన్నికలా ? సాధారణ ఎన్నికలా అనే కన్ఫ్యూజన్ లో ఉండగానే, జగన్ తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు.సాధారణ ప్రజల్లో వైసిపి ప్రభుత్వంపై ఆదరణ పెరిగే విధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీనే వారు గెలిపించే విధంగా అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube