షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల నిరసన..!

తెలంగాణాకు దక్కాల్సిన నీటులో ఒక్క చుక్క కూడా వదులుకోమని ఈమధ్యనే వైఎస్ షర్మిల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.అందుకోసం ఎవరినైనా ఎదురిస్తానని ఆమె అన్నారు.

అయితే షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని రైతులు మండిపడుతున్నారు.హైదరాబాద్ లోని వైఎస్ షర్మిల ఇంటి ముందు ఏపీ రైతులు ధర్నాకి దిగారు.

కృష్ణా నీళ విషయంలో ఆమె వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ కొందరు షర్మిల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు.షర్మిల ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించ్గా ఆమె మద్ధతు దారులు అడ్డుకున్నారు.

కృష్ణా నీళ్ల విషయంలో షర్మిల వైఖరిని స్పష్టం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ఆమె వ్యాఖ్యల వల్ల రాయలసీమ రైతులు నష్టం చేసేలా ఉన్నాయని అన్నారు.

Advertisement

అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపుడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వైఎస్సార్ తెలంగాణా పార్టీ స్థాపించిన షర్మిల తెలంగాణా ప్రజలకు అండగా ఉంటానని చెబుతున్నారు.తెలంగాణాలో దొరల పాలనకు అంతం పలకాలని ఆమె కే.సి.ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణాకి అన్యాయం జరగకూడదని ఏపీపై పోరటానికి సిద్ధమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు