వివేకా కేసు విచారణలో న్యాయస్థానాలపైన ఆరోపణలు.. ?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసులో సీబీఐ ( CBI ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి( MP Avinash Reddy ) సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.

 Allegations On Courts In Viveka Case Investigation Details, Ys Vivekananda Reddy-TeluguStop.com

అయితే దీనిపై ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పలు ఆరోపణలు చేస్తుంది.ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డి అరెస్ట్ ను కావాలనే జాప్యం చేస్తున్నారనే వాదనలు సైతం తెరపైకి వచ్చింది.

హత్య కేసుపై విచారణ జరుపుతున్న సీబీఐ సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తుంది.దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.

ఇందులో భాగంగా హత్య జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలను తుడిచి వేశారనే అంశం కూడా న్యాయస్థానం దృష్టికి వచ్చింది.దీనిపై న్యాయమూర్తి స్పందించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని ఓ ఎంపీ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

విచారణ చేస్తున్న జడ్జి వివేకా మృతదేహాంపై గాయాలు కనిపించాయా అని ప్రశ్నించగా.సీబీఐ మర్డర్ అనే చెప్తారని వెల్లడించింది.ఈ క్రమంలో హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు తుడవడం ఎవిడెన్స్ టాంపరింగ్ ఎలా అవుతుందని జడ్జి ప్రశ్నించడం వింతగా ఉందన్నారు.ఎక్కడైనా హత్య జరిగితే అక్కడి ఆధారాలు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

అది మినిమమ్ కామన్స్ సెన్స్ అన్న ఎంపీ న్యాయమూర్తి ఎవరనేది ప్రజలు చూడకపోవడం ఆయన అదృష్టమంటూ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Telugu Ys Vivekas, Telangana, Ys Viveka, Ysvivekananda-Telugu Political News

అయితే వివేకా హత్య కేసు విషయంలో ఇప్పటికే ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు.ఆయన కార్యక్రమాలలో భాగంగా పులివెందులకు వెళ్తున్న సమయంలో కాల్ వచ్చిందని.అప్పుడే వివేకా మరణించినట్లు శివప్రకాశ్ రెడ్డి తనకు చెప్పారని తెలిపారు.

తాను వెళ్లకముందే వివేకా రాసిన లేఖ, సెల్ ఫోన్ ను దాచేశారని చెప్పారు.డ్రైవర్ ను వదిలి పెట్టొద్దని వివేకా లేఖ రాశారని, అయితే ఆ లెటర్ ను, ఫోన్ ను దాచమని రాజశేఖర్ రెడ్డి తనతో చెప్పారని వెల్లడించారు.

ఈ క్రమంలోనే హత్య కేసులో ఆ లెటరే కీలకమని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Telugu Ys Vivekas, Telangana, Ys Viveka, Ysvivekananda-Telugu Political News

ఈ నేపథ్యంలో తాజాగా న్యాయవ్యవస్థనే తప్పుబడుతూ మాట్లాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.తమకు ఏదైనా తీర్పు అనుకూలంగా వస్తే న్యాయస్థానాలు నిజాయితీకే పట్టం కట్టాయని చెప్పడం.అదే వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డబ్బులు తీసుకుని న్యాయాన్ని అమ్ముతున్నారని కొంతమంది బహిరంగంగా చేసే ఆరోపణలు ఎంతవరకు సమంజసం.పార్టీని, నాయకులను రాజకీయ పరంగా ఎదుర్కొనలేకనే అవాస్తవాలను నిజాలుగా నిరూపించాలని చేసే ప్రయత్నాలుగా ఆరోపణలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇంతకి నిజం ఏంటి.? అబద్ధం ఏంటి.? రాజకీయాల కోసం ఆరోపణలు చేస్తున్నారా?  న్యాయం కోసం ఏర్పాటు చేసిన కోర్టులు అన్యాయాన్ని సమర్థిస్తున్నాయనడం కరెక్టేనా.? పార్టీల మీద ఉన్న వ్యతిరేకతను బయట పెట్టేందుకు ఇలాంటి విమర్శనాస్త్రాలు ఉపయోగిస్తున్నారా.? అనేది సర్వత్రా ప్రశ్నార్థకంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube