తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ఇలా రాజకీయాలు సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 27 సంవత్సరాలు పూర్తి కావడంతో పలువురు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు(Director K Raghavendra Rao) కూడా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ తనకు చిన్నప్పటినుంచి బాగా తెలుసని తెలిపారు.తాను చిరంజీవి(Chiranjeevi) కోసం వారి ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ పరిచయమయ్యారని అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఏ పని చేసినా ఒక దీక్షలాగా చేసేవారని తెలిపారు.అదే దీక్షతో హీరోగా రాణించి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారని రాఘవేంద్రరావు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక పవన్ కళ్యాణ్ 27 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా రాఘవేంద్రరావు కూడా తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా నటుడుగా కొనసాగుతూనే ఈయన ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చారు.ఇక ఈయన జనసేన పార్టీని కూడా స్థాపించి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాఘవేంద్రరావు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేస్తున్న ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా మారిపోయారు.







