ఏపీలో కులాలపై విష ప్రచారం జరుగుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.సమాజంలో కులాలను విడదీసే మనుషులు ఎక్కువ ఉన్నారని విమర్శించారు.
కాపుల దగ్గర అంత ఆర్థిక బలం లేదని పవన్ కల్యాణ్ తెలిపారు.సంఖ్యా బలం ఉన్నా ఐక్యత లేదన్నారు.
కానీ ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని పవన్ పేర్కొన్నారు.సంఖ్యాబలం ఉంటే అధికారం పంచుకోక తప్పదని అర్థం కావాలన్నారు.
ఒక కులం పక్షాన తాను మాట్లాడనని పవన్ తెలిపారు.అధికారం ఒకరి సొంతం కాదన్న పవన్ కల్యాణ్ సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకు రూ.2 కోట్లు సంపాదించే సత్తా ఉందని చెప్పారు.ప్రస్తుతం కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదన్నారు.
కాపులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదని పవన్ స్పష్టం చేశారు.







