సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పెళ్లి విషయాలల్లో మాత్రం తమకు నచ్చినట్లుగా ఆలోచిస్తూ ఉంటారు.మరికొందరు కఠినంగా ఉంటారు.
ఇక కొందరికి అయితే పెళ్లంటేనే అసలు పడదు.ఎందుకో తెలియదు కానీ వారి ఆలోచనలు అలా ఉంటాయి.
నిజానికి పెళ్లి చేసుకోకపోవటమే మంచి ఆలోచన అన్నట్లు ఉంటారు.వారికి ఆ ఆలోచనలు ఏదైనా అనుభవం ఉంటేనే వస్తాయి అన్నట్లు చెప్పవచ్చు.
లేదా బయట సమాజంలో జరిగే వాటిని దృష్టిలో పెట్టుకొనైనా సరే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు.అలా ఇప్పటికి కొంతమంది నటీనటులు ఉన్నారు.సామాన్య ప్రజలు కూడా ఉన్నారని చెప్పవచ్చు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన లేడీ కమెడియన్ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంది.
అయితే తను పెళ్లి చేసుకోకపోవటానికి కూడా ఒక కారణం ఉందని తెలిపింది.ఇంతకు ఆమె ఎవరో కాదు స్నిగ్ధ.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి స్నిగ్ధ.ఈమె గురించి అందరికి పరిచయమే.ఈమె చూడటానికి అచ్చం అబ్బాయిలాగా కనిపిస్తుంది.తను నటించిన సినిమాల్లో కూడా అబ్బాయి లాగానే నటించేది.చాలా వరకు కమెడియన్ గా చేసి మంచి గుర్తింపు సంపాందించుకుంది.

ఇక ఈమె నందినీరెడ్డి దర్శకత్వంలో 2011 లో తెరకెక్కిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆ తర్వాత మేం వయసుకు వచ్చాం, దమ్ము, టైగర్, కల్యాణ వైభోగమే వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు బుల్లితెర షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా రచ్చ చేస్తుంది.
కొన్ని కొన్ని సార్లు కొన్ని షోల్డర్లు కూడా పాల్గొంటుంది.అయితే ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి కి చెందింది.ఇక ఈమె తల్లిదండ్రులు జగదీష్, రాజేశ్వరి.ఆమె తండ్రి డాక్టర్.
ఇక స్నిగ్ధ సినిమాలోకి రాకముందు ఒక కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ గా చేసింది.ఆ తర్వాత అనుకోకుండా వెండితెరపై అడుగు పెట్టింది.
చాలావరకు హాస్య పాత్రలో నటించి హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమెకు నంది పురస్కారం కూడా అందింది.
ఇక ఈమె చివరిగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో నటించగా ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలలో కూడా అడుగుపెట్టలేదు.అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తన గురించి చెబుతూ ఉంటుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది.ముఖ్యంగా తన పెళ్లి గురించి ఒక విషయం బయటపెట్టింది.ఇక యాంకర్ తనను పెళ్లి గురించి అడగటంతో.కళ్యాణమొచ్చిన, కక్కొచ్చిన ఆగదంటారు.అలాంటి సందర్భం వస్తే ఆగదని అన్నది.అంతేకాని తను ప్రత్యేకంగా పెళ్లికి ట్రై చేయను అని తెలిపింది.
పైగా తనకు దానిమీద నమ్మకం లేదు అన్నట్లుగా తెలిపింది.ఇక తను సంవత్సరంలో కొన్ని రోజులు దీక్షలోనే ఉంటానని తెలిపింది.
ఇక సంవత్సరం మొత్తం దీక్షలు చేసుకుంటే వెళ్తే హాయిగా సన్యాసి లాగా మిగిలిపోతాను అని తెలిపింది.పెళ్లి చేసుకుంటే అక్కడితో లైఫ్ అనేది మరోలా మారుతుంది అని తెలిపింది.
అందుకే తను ఆ విషయం గురించి ఆలోచించనని తెలిపింది.ఇక ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతుంది.







