దసరా సినిమాను RRR, కేజిఎఫ్ సినిమాలతో పోల్చడానికి అదే కారణం.. నాని కామెంట్స్ వైరల్!

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు ఇక ఇందులో నాని సరసన కీర్తి సురేష్ నటించబోతున్నారు.ఇక ఈ సినిమా 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా గురించి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఓరి వారి అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

ఈ పాట లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు.ఈ క్రమంలోనే మీడియా అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పారు.అయితే ఈ సినిమాలో నాని డీ గ్లామర్ లుక్ లోకనిపించడంతో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లో కాపీ చేశారంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

ఈ విషయంపై స్పందించినటువంటి నాని ఏడాదికి 500 సినిమాలు విడుదలవుతాయి అందులో 495 మంది హీరోలు తమ సినిమాలలో ప్యాంటు చొక్కా వేసుకుంటారు అంతమాత్రాన ఆ సినిమాలలో వారి లుక్ కాపీ కొట్టినట్టు కాదు అంటూ తెలిపారు.

అలాగే మరొకరు నానిని ప్రశ్నిస్తూ దసరా సినిమాని RRR , కేజిఎఫ్ అంటే సినిమాలతో పోల్చారు.ఇది ఎంతవరకు సమంజసం అన్ని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు నానీ సమాధానం చెబుతూ తాను RRR , కేజిఎఫ్ సినిమాల మాదిరిగా మా సినిమా 500,1000కోట్ల బడ్జెట్ పెట్టి తీయలేదని తెలిపారు.అలాగే ఈ సినిమాలలో ఉండే సన్నివేశాలు లాగా మా సినిమా ఉంటుందని చెప్పలేదు అయితే ప్రతి ఏడాది ఒక్క చిత్ర పరిశ్రమ నుంచి కొన్ని సినిమాలు విడుదలవుతూ ఆ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తాయి .గత ఏడాది విడుదలైన RRR , కేజిఎఫ్ సినిమాలు తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి.అలాగే ఈ దసరా సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు అంతే గర్వకారణంగా ఉంటుందని తెలిపానంటూ ఈ సందర్భంగా నాని క్లారిటీ ఇచ్చారు.

దీంతో నాని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు