మహేష్ బాబు, డైరెక్టర్స్ హీరో అంటారు.సినిమా ఫ్లాప్ అవొచ్చు కాని మహేష్ ఎప్పుడు ఫ్లాప్ అవడు అంటారు .
నట వజ్రం అంటారు .మరి నిజంగానే మహేష్ అద్భుతమైన నటుడు.హాలివుడ్ మెటిరియాల్ అని ఊరికే అనరు మహేష్ ని .అలాంటి మహేష్ నటనని తిట్టుకున్నారట .
అవును .ఆగడు సినిమా మహేష్ కి చాలా చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఖలేజా,1 నేనొక్కడినే చిత్రాలు పరాజయం పాలైనా మహేష్ కి మాత్రం నెగెటివ్ మార్క్స్ పడలేదు.మరీ ముఖ్యంగా నేనోక్కడినేలో మహేష్ నటన న భూతో .న భవిష్యత్ … సినిమా బాగుండకపోతే అది డైరెక్టర్ తప్పు కాని మహేష్ తప్పు కాదు అని జనాలు అనుకునేంతల తన నటనప్రతిభ ఉంటుంది.కాని ఆగడు మహేష్ చిత్రాలన్నిటిలోకి భిన్నం.
అది కేవలం బాక్సాఫీస్ వరకే కాదు .అన్ని రకాలుగా డిజాస్టర్ .ఇదే విషయాన్నిమహేష్ చెప్తూ ” ఆగడు నేను చేసిన అతి పెద్ద తప్పు, మొదటిసారి జనాలు నా నటనకు మంచి మార్కులు వేయలేదు .నిజం చెప్పాలంటే నన్ను తిట్టుకున్నారు.ఇక నుండి అలాంటి సినిమాలు చేయను ” అంటూ బాధపడ్డాడు సూపర్ స్టార్.







