తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) అనూహ్యంగా క్రేజ్ పెరుగుతోంది.వివిధ పార్టీలతో పాటు ప్రజల్లోనూ రేవంత్ పని తీరుపై ప్రస్తుతానికి ప్రశంసలే కురుస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ కంటే భిన్నంగా రేవంత్ పరిపాలన మొదలుపెట్టడం, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం, ప్రజాప్రతినిధులకు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం వంటివి చేస్తూ… ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.గత బిఆర్ఎస్ ( Brs )పాలనలో కేసీఆర్ ను కలిసేందుకు సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు సైతం అపాయింట్ మెంట్ దొరికేది కాదు.
అసలు ఎవరికీ అందుబాటులో లేకుండా కేసీఆర్ ఉండేవారు.ఈ విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్( KCR ) తీరుపై అసంతృప్తితోనే ఉండేవారు.
నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు చెప్పుకునేందుకు కనీసం అవకాశం ఇవ్వకపోతే ఎలా అంటూ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉండేవారు.రేవంత్ సీఎం అయిన తర్వాత ఆ పరిస్థితికి భిన్నంగా ఉంది.
రేవంత్ అందరికీ అందుబాటులో ఉండడం తో పాటు, ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ అడిగిన వెంటనే ఇస్తున్నారు.ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రోజు రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.ప్రగతి భవన్ ను ప్రజాభవన్ ( Praja Bhavan ) గా మార్చి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కారానికి కృషి చేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీంతో సామాన్యులలోను, ప్రజాప్రతినిధుల్లోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక దీనికి తగ్గట్లుగానే కొద్దిరోజుల క్రితం శాసనమండలిలో ఎమ్మెల్సీ నర్సారెడ్డి( MLC Narsa Reddy ) చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి .గత బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ను కలిసేందుకు దాదాపుగా 30 సార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా తనకు దొరకలేదని, కానీ రేవంత్ రెడ్డి వారం రోజుల్లోనే మూడుసార్లు కలిసేందుకు తనకు అవకాశం ఇచ్చారని చేసిన వ్యాఖ్యలు రేవంత్ కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం , కేసీఆర్ వ్యవహార శైలి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారింది.ఎక్కువగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, ప్రగతి భవన్ కు వచ్చినా, ఎవరికి అందుబాటులో ఉండకపోవడం వంటివి చోటు చేసుకునేవి.కానీ దానికి భిన్నంగా రేవంత్ అందరికీ అందుబాటులో ఉండడంతో , కేసిఆర్ – రేవంత్ శైలిని అంతా బేరీజు వేసుకుంటున్నారు.