తాజాగా జరిగిన తెలంగాణ ( Telangana ) ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూసింది.దీంతో ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకొని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మేమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక రేపు కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ఎల్పీ నేత ఎవరు అని సందిగ్ధంలో పడ్డారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.అయితే ఇప్పటికే కేటీఆర్( KTR ) , హరీష్ రావు పేరు వినిపించినప్పటికీ వీరు కాకుండా ఈసారి ఆ నాయకుడికే ఛాన్స్ ఇవ్వాలి అని కేసిఆర్ భావిస్తున్నారట.
ఇక ఆయన ఎవరో కాదు ఎలాంటి వివాదాలు లేని ఎలాంటి విమర్శలు ఎదుర్కొని కడియం శ్రీహరికి ఈసారి ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నారట.

అలాగే కడియం శ్రీహరి ( Kadiyam Srihari ) దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఈయనకి ఎల్పీ నేతగా అవకాశం ఇస్తే పార్టీపై మంచి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందని భావిస్తున్నారట.ఇక ఎస్సి వర్గానికి చెందిన కడియం శ్రీహరికి గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది.అలా ఈయనకు ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట.
అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు.ఆయన దగ్గరికే ఎమ్మెల్యేలు అందరూ వచ్చి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా కేసీఆర్ ( KCR ) గెలిచారు.కానీ త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ఎల్పి నేత ఎవరు అనే ప్రశ్న బీఆర్ఎస్ నాయకుల్లో అలాగే ప్రజల్లో మెదులుతోంది.ఈ నేపథ్యంలోనే హరీష్ రావు( Harish rao) , కేటీఆర్ ని పక్కన పెట్టి కడియం శ్రీహరికి ఆ పదవి ఇస్తే బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో సదుద్దేశం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
కానీ దీనిపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు.ఇంకో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ఎల్పీ నేత ఎవరో ప్రకటించనున్నారు.