నితిన్ పవర్ పేట ఆగిపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన నితిన్ తండ్రి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న హీరో నితిన్ అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే అందరిలాగే నితిన్ కెరియర్ లో కూడా కొన్ని చిత్రాలు ఎదురయ్యాయి.

 That Is The Reason Why Nitin Power Pita Stopped Nitin Father Said The Real Thing-TeluguStop.com

ఈ విధంగా ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఏ మాత్రం నిస్సహాయత ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇకపోతే నితిన్ హీరోగా మాత్రమే కాకుండా ఈయనకు సొంత బ్యానర్ కూడా నా సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం నితిన్ తన సొంత బ్యానర్ లో పలు సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక ప్రస్తుతం ఇతను మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు.

గతంలో నితిన్ తన సొంత బ్యానర్ లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమాని ప్రకటించారు.ఈ విధంగా సినిమా పేరును ప్రకటించిన అనంతరం ఈ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావన రాకపోవడంతో అభిమానులు సైతం ఈ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయారు.

Telugu Nithin, Nitin, Nitinsudhakar, Pita, Telugu, Tollywood-Movie

ఇకపోతే తాజాగా నితిన్ తన సొంత బ్యానర్ లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాని తెలుగులో విడుదల చేశారు.ఇక ఈ సినిమా అద్భుతమైన హిట్ టాక్ సొంతం చేసుకొని లాభాల బాట పట్టింది.ఈ క్రమంలోనే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడంతో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే నితిన్ హీరోగా ప్రకటించిన పవర్ పేట చిత్రం ఆగిపోవడానికి గల కారణాన్ని కూడా తెలియజేశారు.

సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆ కథ ఫైనల్ వర్షన్ బాగా రాలేదని ఆపేశాం అంటూ ఈ సినిమా ఆగిపోవడానికి కారణాన్ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube