మమ్మల్ని స్పాయిల్ చేస్తున్నందుకు థాంక్స్ ప్రభాస్.. దిశా పటానికి భోజనం పంపిన బాహుబలి!

టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.మొత్తానికి పాన్ ఇండియా సినిమాలకు పరిమితమైన ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

 Thanks Prabhas For Spoiling Us Bahubali Sent Lunch To The Disha Patani , Prabhas-TeluguStop.com

ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఆయన సరసన నటించిన నటులు ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు తెలుపుతుంటారు.

ఇంత స్టార్ రేంజ్ లో ఉన్నా కూడా ఎప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఫీల్ అవ్వడు ప్రభాస్.ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు అనే హోదా తో కాకుండా మంచి స్నేహితుడిగా ఉంటాడు ప్రభాస్.

మేకప్ మాన్ నుండి ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా అభినందిస్తాడు.ఇక తన ఇంటి నుండి తయారుచేసిన అభిరుచులను కూడా షూటింగ్ లో ఉన్నవారికి రుచి చూపిస్తుంటాడు.

నిజానికి ఆహారం విషయంలో రకరకాల రుచులు చూపిస్తుంటారట ప్రభాస్ కుటుంబం.

ప్రభాస్ ఇంట్లో గోదావరి వంటకాలు చాలా ఫేమస్ అట.ఇక తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి తమ ఇంటి రుచులను చూపిస్తుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటి దిశా పటాని కి కూడా తమ ఇంటి వంట రుచులను పరిచయం చేశాడు.

ఇదివరకు తన సినిమాల్లో నటించిన చాలామంది నటీనటులకు తన ఇంటి భోజన రుచులు చూపించాడు ప్రభాస్.అలా ఇప్పటికీ చాలామంది సెలబ్రెటీలు ప్రభాస్ ఇంటి రుచులు చూశారు.

సెట్ లోనే కాకుండా సెలబ్రేటీల ఇళ్లలకు కూడా పంపిస్తూ ఉంటాడు.

ఆ మధ్య ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా సమయంలో తమ ఇంటర్నెట్లీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూడా తన ఇంటి రుచిని పరిచయం చేశాడు ప్రభాస్.

షూటింగ్ లో ఉన్నవారికి తమకు నచ్చిన ఫుడ్ ను అడిగిన వెంటనే పార్సిల్ రూపంలో తమ ఇంటికి పంపిస్తుంటాడు.అలా ఆ సమయంలో భాగ్యశ్రీ కి కూడా తన ఇంటి నుంచి తయారు చేసిన పూతరేకులను పంపాడు.

ఇదిలా ఉంటే తాజాగా మరో ముద్దుగుమ్మ కు తన ఇంటి రుచిని చూపించాడు ప్రభాస్.

ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.

లోఫర్ సినిమాలో వరుణ తేజ్ సరసన నటించి తెలుగులో ఫేమ్ సంపాదించుకున్న దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.ఆ తరువాత M.S ధోని సినిమాలో నటించి ప్రేక్షకులను మరింత మెప్పించింది.ఇక బాలీవుడ్ లో ఈ భామ గురించి చెప్పనవసరమే లేదు.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.

Telugu Disha Patan, Lunch, Prabhas, Tollywood-Movie

ఇక ఈ భామ అందం లోనే కాకుండా రకరకాల దుస్తులు ధరించడంలో కూడా దిట్ట.కాబట్టి డ్రెసింగ్‌ స్టైల్ లో కూడా వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు.ఇక ఎప్పటికప్పుడు వెరైటీ దుస్తులతో తన ఇన్ స్టా ఖాతా లో పోస్ట్ లు పెడుతూ.

ఫాన్స్ ను ఫిదా చేస్తుంది.అలా తాజాగా తన ఇన్ స్టా లో ప్రభాస్ ఇంటి నుండి వచ్చిన కొన్ని ఫుడ్ పదార్థాలను ఫోటో ద్వారా షేర్ చేసుకుంది.

ఇక ఆ ఫోటోకు.మమ్మల్ని స్పాయిల్ చేస్తున్నందుకు థాంక్స్ ప్రభాస్ అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube