మహంకాళి మూవీస్ బ్యానర్ పైన మహంకాళి దివాకర్ నిర్మాత గా, జిబి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్లాక్.మే 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన హీరో ఆది సాయి కుమార్ మీడియా తో మాట్లాడుతూ “మంచి కంటెంట్ ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని మరోసారి ప్రూవ్ చేశారు.అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే, థియేటర్ లో సినిమా చూసే అప్పుడు ఆడియన్స్ త్రిల్ గా ఫీల్ అవుతున్నారు.
నిజంగా మేము అనుకున్నట్లుగా సినిమా ప్రేక్షకులను మెప్పించి, ఈ రోజు హిట్ కొట్టింది అన్నారు.
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ “బ్లాక్ సినిమా ని బ్లాక్ బాస్టర్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు”.
డైరెక్టర్ జిబి కృష్ణ మాట్లాడుతూ “నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి, హీరో ఆది సాయి కుమార్ గారికి ధన్యవాదాలు, మార్నింగ్ షో అవ్వగానే నా ఫ్రెండ్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో గల పెద్దలు అందరూ మెచ్చుకుంటున్నారు”.బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మాట్లాడుతూ “ఇలాంటి థ్రిల్లర్ & కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ అరుదుగా వస్తాయి.
అందులో మన బ్లాక్ ఇలా ప్రేక్షకులను అలరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.సినిమా లో నా పాత్ర ని చూసిన నా ఆర్మీ , అభిమానులు, ఇతర ప్రేక్షకులు సైతం చాలా డిఫరెంట్ గా కౌశల్ చేశారు అంటూ అభినందించారు.
సినిమా హిట్ చేస్తున్న ప్రేక్షకులకి, సహకరిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కి ధన్యవాదాలు అన్నారు.
నటీనటులు అది సాయి కుమార్, ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు
సాంకేతిక నిపుణులు నిర్మాత : మహంకాళి దివాకర్ రచన – దర్శకత్వం : జి బి కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్ సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల సంగీతం : సురేష్ బొబ్బిలి ఎడిటింగ్ : అమర్ రెడ్డి ఫైట్స్ : రామకృష్ణ ఆర్ట్ : కె వి రమణ పి ఆర్ ఓ : పాల్ పవన్
.