నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమా( Thandel Movie )కు సంబంధించిన న్యూస్ రోజుకొకటి నెట్ లో హల్చల్ చేస్తుంది.అయితే ఈ సినిమా మీద నాగచైతన్య( Naga Chaitanya ) భారీ అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దాంతోపాటుగా చందు మొండేటి( Chandoo Mondeti ) కూడా ఇప్పటికే కార్తికేయ 2 సినిమా తర్వాత ఒక డిఫరెంట్ జనార్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా చేసుకొని తీస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ చివర్లో చనిపోతుందనే న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక దాంతో సాయి పల్లవి( Sai Pallavi ) అభిమానులు ఆమె చనిపోతే సినిమా అనేది అంత పెద్ద సక్సెస్ అవ్వదు ఆమె క్యారెక్టర్ ని బ్రతికించే ప్రయత్నం చేయండి అంటు ఇప్పటికే డైరెక్టర్ చందు మెందేటి కి చాలా మెసేజ్ లు పంపుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో కూడా తన చివరలో చనిపోతుంది.దానివల్ల ప్రేక్షకులు క్లైమాక్స్ ను రిసీవ్ చేసుకోలేకపోయారు.
సాయి పల్లవి చనిపోతే ఈ సినిమా కూడా తేడా కొట్టే అవకాశం అయితే ఉంది.

కాబట్టి ఆమె బతికుంటేనే సినిమా హిట్ అవుతుంది అని మరి కొంతమంది ఈ సినిమా మీద కామెంట్లు అయితే చేస్తున్నారు.అయితే నాగచైతన్య చేపల కోసం అని వెళ్లి పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోతాడు.దానివల్ల అతన్ని విడిపించే ప్రాసెస్ లో సాయి పల్లవి పాకిస్థాన్ పోలీసులతో( Pakistan Police ) గొడవ పెట్టుకొని తను ప్రాణాలు విడుస్తుందంటూ ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమం లో సాయి పల్లవి ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ కాంబినేషన్ లో ఇంతకు ముందు లవ్ స్టోరీ అనే సినిమా వచ్చింది.
ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.