Tamannaah : ట్రోల్స్ పై ఫైర్ అయిన తమన్నా… ముందు మీకే తెలుస్తాయంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి తమన్నా ( Tamannaah ) ఒకరు.ఈమె గత రెండు దశాబ్దాలుగా హీరోయిన్ల ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు.

 Thamannah Fires On Social Media Trolls-TeluguStop.com

ఇప్పటికీ ఈమె సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma ) తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇలా వీరి ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత వీరిద్దరూ కలిసి చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉన్నారు.

Telugu Trolls, Thamannah, Tollywood, Vijay Varma-Movie

ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఈ పెళ్లి గురించి తమన్నా అటు విజయ్ వర్మ ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు.ఇక తమన్నా పెళ్లి గురించి ఆమె వ్యక్తిగత విషయాలు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై తమన్న స్పందించి అసహనం వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో తమన్నా కాస్త శరీర బరువు పెరగడంతో( Overweight ) పలువురు ఆమెపై బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తున్నారు.ఇలా కోవిడ్ కారణంగా తాను కాస్త బరువు పెరగడంతో పలువురు ఆమె పట్ల ట్రోల్స్ చేస్తున్నారు.

అదే విధంగా తన వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో తమన్న సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్( Body Shaming Comments ) పై స్పందించారు.

Telugu Trolls, Thamannah, Tollywood, Vijay Varma-Movie

సెలబ్రిటీల జీవితాల పై చాలా మంది వారి సొంత అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ ఉంటారు.మా జీవితాల్లో ఏం జరుగుతుందో మా కంటే ముందే వాళ్లే చెబుతారు.అందుకే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ నెగిటివ్ కామెంట్లను( Negative Comments ) తాను ఏమాత్రం పట్టించుకోను అంటూ ఈ సందర్భంగా తమన్నా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని తనకు నార్త్ సౌత్ అనే తేడాలు లేవని ఈ రెండు ఇండస్ట్రీలు నాకు సొంత ఇల్లు లాంటివి అంటూ ఈ సందర్భంగా తమన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube