మాస్ రాజాతో థమన్.. అలాంటి పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు కిక్!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.

 Thaman Shares Intresting Pic With Ravi Teja, Ravi Teja, Ravi Teja Gopichand Mal-TeluguStop.com

తమన్ ఒకరు.ఈయన మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కున్న దృడంగా నిలబడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.

అఖండ నుండి వరుస విజయాలు అందుకోవడంతో ఈయననే మళ్ళీ మళ్ళీ తమ సినిమాలకు రిపీట్ చేస్తున్నారు హీరోలు.ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఈయనే మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక ఈయన ఖాతాలో ఇప్పుడు మరో సినిమా చేరిపోయింది.మాస్ మహారాజా రవితేజ( Raviteja ) – గోపీచంద్ మలినేని కాంబో ఇప్పుడు అఫిషియల్ అయ్యింది.

డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత నాల్గవ సారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.గోపీచంద్ మలినేని( Gopichand Malineni )తో రవితేజ చేయబోతున్న ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ నే ఫిక్స్ అయ్యాడు.ఈ క్రమంలోనే థమన్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని తెలుపుతూ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

బ్యాక్ విత్ మై కిక్..ఇట్స్ టైం టి క్రాక్ అంటూ ఈయన కామెంట్స్ చేస్తూ ఒక పిక్ షేర్ చేసాడు.ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కిక్ సినిమాకు అలాగే గత ఏడాది వచ్చిన క్రాక్ సినిమాకు( Krack ) ఈయన గుర్తిండి పోయే ఆల్బమ్స్ ఇచ్చాడు.

అలాగే బీజీఎమ్ తో బాక్స్ లు దద్దరిల్లేలా చేసాడు.మరి ఈసారి ఈ కాంబో ఎలా ఉంటుందో చూడాలి.మైత్రి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే షూట్ స్టార్ట్ కానుంది.ఇక వీరసింహారెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న గోపీచంద్ ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తారో మాస్ రాజాకు క్రాక్ వంటి విజయం అందిస్తాడో చూడాలి.

ఇక రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుతో ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube