తనను అవమానించిన నెటిజన్ కు థమన్ కౌంటర్... ఏమన్నాడంటే?

ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఇక సోషల్ మీడియా వల్ల లాభమెంత ఉందో నష్టం కూడా అంతే ఉంది.

ఇక సోషల్ మీడియాను మంచిగా వాడుకుంటే దాని వల్ల ఎన్నో లాభాలున్నాయి.కాని చెడుకు వాడితే జరిగే విధ్వంసం అంతా ఇంతా కాదు.

మంచి కోసం వాడితే చాలా తొందరగా కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది.కాని ఇటు మంచి కాక చెడు కాక ఇక ఎదుటి వారిని అవమానించడమే పనిగా పెట్టుకుంటారు వారే మీమర్స్.

ప్రస్తుతం వీరి హవా సూపర్ ఫామ్ లో ఉన్నదని చెప్పవచ్చు.మీమ్స్ సరదా కొరకైతే పరవాలేదు.

Advertisement

కాని సరదా శృతి మించితేనే చాలా నష్టం వాటిల్లుతుంది.ఇక వాటితో సెలెబ్రెటీస్ పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

తాజాగా ఎస్.ఎస్.థమన్ పై ఓ నెటిజన్ వ్యంగ్యంగా మీమ్ చేసి అవమాన పరిచాడు.ఇక ఆ మీమ్ పై సదరు నెటిజన్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.

నువ్వు పనీ పాట లేకుండా ఇలాంటి మీమ్స్ చేస్తూ ఇతరులను అవమాన పరుస్తున్న మూర్ఖుడిని నేను పెళ్లి చేసుకున్నానా అని మీ భార్య గర్వపడుతుంది అంటూ దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చావంటూ నెటిజన్లు థమన్ ను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు.

350 మంది అభిమానులకు లంచ్ ఏర్పాటు చేసిన సాయితేజ్.. ఈ మెగా హీరో గ్రేట్!
Advertisement

తాజా వార్తలు