టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలకు మంచి మంచి మ్యూజిక్ ను అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు తమన్.
ఇకపోతే తమన్ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవలే సర్కారు వారి పాట ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇకపోతే ప్రస్తుతం తమన్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, అలాగే రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సి 15 సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే చాలా మంది తమ అభిమానులకు తమ వ్యక్తిగత విషయాల గురించి చాలా వరకు తెలియదు.
ఆయన భార్య పిల్లలు ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు.ఇంకా కొంతమంది అయితే తమన్ గురించి, తమ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలి అని ఆతృతగా ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ మొదటి సారిగా తన కొడుకు భార్య గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ప్లే బ్యాక్ సింగర్ అయిన శ్రీ వర్ధినిని తమన్ వివాహం చేసుకున్న విషయం తేలిసిందే.
ఆమె గతంలో మణిశర్మ, యువన్ శంకర్ రాజా లతో కలిసి పనిచేసింది.
అంతేకాకుండా తమన్ డైరెక్షన్ చేసిన సినిమాలలో కూడా నాలుగు పాటలు పాడింది.తమన్ భార్య వర్ధిని వాయిస్ బాగుంటుందని డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లకు అనిపిస్తే పాడిస్తారు.భవిష్యత్తులో ఆమెతో కలిసి స్టేజ్ షోలు చేయాలని ఉందని.
అయితే అంతకంటే ముందుగా ఆమె రెండు మూడు సూపర్ హిట్ పాటలను పాడాలని తమన్ చెప్పుకొచ్చాడు.అనంతరం తన కొడుకు గురించి మాట్లాడుతూ నా ట్యూన్‌లను మొదటగా విని అభిప్రాయం చెబుతాడు.
మ్యూజిక్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటంలో అతడికి మంచి పట్టు ఉంది అని తెలిపాడు.అంతేకాకుండా పియానోలో నాలుగో గ్రేడ్ కూడా పూర్తి చేశాడు.
అతడు ఏ వృత్తి ఎంచుకుంటాడో నాకు తెలియదు అని తమన్ తన కొడుకు, భార్య గురించి వెల్లడించారు.