కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి సినిమా వస్తుంది అంటే తమిళ్ లో ఏ రేంజ్ లో హడావిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.ఈయనకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక విజయ్ సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ కు అదే రేంజ్ లో జరుగుతుంది.అయితే ఈసారి మరింత ఎక్కువ బిజినెస్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
విజయ్ దళపతి ప్రెజెంట్ వారసుడు సినిమా చేస్తున్నాడు.టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.తమిళ్ లో ‘వరిసు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మరో రూమర్ వైరల్ అయ్యింది.విజయ్ కెరీర్ లోనే సెన్సేషనల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.ఒక్క తెలుగు బిజినెస్ మినహా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగినట్టు టాక్.తమిళ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా తెలుగు భాషలో మినహా హిందీ, తమిళ్ అన్ని హక్కులు కలిపి 250 కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
తెలుగులో మాత్రం ఓన్ గా రిలీజ్ చేయనున్నారట.దీంతో విజయ్ సినిమాకు మొదటిసారి సెన్సేషనల్ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే చెప్పాలి.చూడాలి వంశీ పైడిపల్లి విజయ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో.సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
మరి ఇది తెలుగు సినిమా కాదు తమిళ్ సినిమా అని బాంబు పేల్చడంలో తెలుగులో అయితే అంచనాలు పెద్దగా లేవు.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.