దళపతి విజయ్ 'వారసుడు' ఫస్ట్ లుక్ అదుర్స్..!

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లీడ్ రోల్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

 Thalapathy Vijay Varasudu First Look Released , Dil Raju, Rashmika Mandanna, Tha-TeluguStop.com

సినిమాలో విజయ్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాకు టైటిల్ గా వారసుడు అని ఫిక్స్ చేశారు.

తమిళంలో కూడా వారిసు అని ఫిక్స్ చేశారు.

ఆల్రెడీ ఇదివరకే ఈ సినిమాకు టైటిల్ గా వారసుడు అని డిస్కషన్ లో ఉందని లీక్ అయ్యింది.

అనుకున్నట్టుగానే విజయ్ 66వ సినిమా టైటిల్ గా వారసుడు అని పెట్టారు.వారసుడు ది బాస్ రిటర్న్స్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు.ఈ టైటిల్ పోస్టర్ లో విజయ్ క్లాస్ లుక్ అదిరిపోయింది.తమిళంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ తో క్లాస్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు డైరక్టర్ వంశీ పైడిపల్లి.

మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న ఈ సినిమా కథ విజయ్ కు బాగా నచ్చిందని.అందుకే ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు స్ట్రైట్ గా రావాలని ఫిక్స్ అయ్యారు విజయ్.

జూన్ 22 బుధవారం విజయ్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే వంశీ పైడిపల్లి సినిమా ఫస్ట్ లుక్ తో దళపతి ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube