బీస్ట్ టీమ్ డిన్నర్ పార్టీ..!

దళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా బీస్ట్.ఏప్రిల్ 13న సౌత్ అన్ని భాషల్లో రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.

 Thalapathi Vijay Beast Team Dinner Party, Thalapathi Vijay,beast,pooja Hegde,bea-TeluguStop.com

మిగతా భాషల్లో ఎలా ఉన్నా బీస్ట్ సినిమా తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.అక్కడ విజయ్ సినిమా ఎలా ఉన్నా వసూళ్ల బీభత్సం సృష్టిస్తాయి.

రిలీజ్ కు ముందే ఆడియోతో హిట్ టాక్ తెచ్చుకోగా రిలీజ్ తర్వాత బీస్ట్ విజయ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.ఈ క్రమంలో విజయ్ బీస్ట్ సినిమా సక్సెస్ సందర్భంగా టీం అంతా కలిసి డిన్నర్ పార్టీచేసుకున్నారు.

విజయ్ హీరోయిన్ పూజా హెగ్దేతో సహా డైరక్షన్ టీం అంతా కలిసి డిన్నర్ పార్టీ చేసుకున్నారు.ఈ విషయాన్ని వెల్లడిస్తూ డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ ఎక్సయిట్ అయ్యారు.

దళపతి విజయ్ తో సినిమా చేయడం తన లక్ అని ఆయన నుండి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని.లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీస్ ఇచ్చారని విజయ్ ని ఆకాశానికి ఎత్తేశాడు డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

పార్టీలో పూజా హెగ్దే కూడా అటెండ్ అయ్యింది.బీస్ట్ రిలీజ్ తర్వాత పూజా హెగ్దే మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

కేవలం సాంగ్స్ కోసమే పూజా చేసిందని కామెంట్స్ వచ్చాయి.అయితే వాటిని పట్టించుకోకుండా పూజా హెగ్దే కూడా బీస్ట్ డిన్నర్ పార్టీలో పాల్గొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube