సముద్ర మార్గంలో ఉగ్ర దాడికి కుట్ర! నేవీ చీఫ్ వాఖ్యలు!

ఇప్పటికే ఇండియాలో సరిహద్దులో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లని టార్గెట్ గా చేసుకొని ఆత్మాహుతి దాడి చేయడం, తరువాత భారత్ పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడులు చేయడం అందరికి తెలిసిందే.సర్జికల్ దాడులని భరించలేక పాకిస్తాన్ ఇండియా మీద దాడులకి తెగబడింది.

 Terrorists Reportedly Being Trained To Attack From Sea-TeluguStop.com

మరో వైపు ఉగ్ర వాదులని ఇండియాలో ప్రవేశ పెట్టి ఇక్కడ దాడుల కుట్రకి ప్లాన్ చేసాయి.ఇక సరిహద్దు వద్ద ఓ వైపు ఉగ్ర వాదులు, మరో వైపు పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల వాతావరణం సద్దుమణగక ముందే ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్ర వాద సంస్థలు భారీ ఉగ్ర చర్యలకి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.

పుల్వామా దాడుల తర్వాత భారత్ భూభాగంలోకి రోడ్డు మార్గం ద్వారానే కాకుండా సముద్ర మార్గం ద్వారా కూడా ఉగ్రవాదులు ఇండియాలో చొరబడి దాడులకి పాల్పడే విధంగా ఉగ్రవాదులకి శిక్షణ ఇస్తున్నట్లు నేవీ చీఫీ బిపిన్ రావత్ తెలియజేసారు.ఇండో-పసిఫిక్ రీజనల్ సమ్మిట్ లో రావత్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

ఇందులో భాగంగా గతంలో ముంబై టెర్రర్ ఎటాక్ తరహాలో సముద్ర మార్గంపై ప్రయాణించి ప్రధాన నగరాలలో ఉగ్ర దాడులకి పాల్పడేందుకు ఉగ్రస్థావరాలలో శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు.ఇక సముద్ర మార్గం నుంచి ఉగ్ర వాదులు రాకుండా అడ్డుకట్ట వేయాల్సిన బాద్యత వుందని చెప్పుకొచ్చారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube