'రామబాణం'తో మెగా హీరోను ఢీ కొట్టబోతున్న గోపీచంద్!

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఈయన కెరీర్ లో మంచి మంచి అందుకున్నాడు.టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన గోపీచంద్ ఈ మధ్య కాలంలో హిట్ అందుకోలేక పోతున్నాడు.2014లో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అయితే ఆ రేంజ్ లో మరో హిట్ అయితే ఈయన ఖాతాలో ఇంత వరకు పడలేదు.

 Tentative Release Date Of Gopichand's Rama Banam, Gopichand, Rama Banam, Tollywo-TeluguStop.com

చేసిన సీటిమార్ సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్న ఆ తర్వాత వచ్చిన పక్కా కమర్షియల్ సినిమాతో మరో ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో ఇప్పుడు చేస్తున్న సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు.ప్రెజెంట్ గోపీచంద్ లౌక్యం రేంజ్ హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు.మరి ఈ క్రమంలోనే ఈయన లౌక్యం హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్ళీ పని చేస్తున్నాడు.

డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీచంద్ ‘రామబాణం‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.రామబాణం టైటిల్ ను బాలకృష్ణ అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా ఇప్పుడు రిలీజ్ డేట్ పై ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమాను ఏప్రిల్ 21న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.ఇదే నిజమైతే గోపీచంద్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష సినిమాతో పోటీ పడబోతున్నాడు అన్నమాట.ఇది నిజమో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తుండగా.మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube