అనంతపురం కలెక్టరేట్ దగ్గర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.కలెక్టర్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు హడావుడి చేస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమంలో అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి కలెక్టరేట్ కు చేరుకున్నారు.డిక్లరేషన్ పత్రాల కోసం అనుచరులతో కలిసి వెళ్లారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కలెక్టరేట్ గేట్ వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.అభ్యర్థితో పాటు కొందరినే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు.
దీంతో ఆగ్రహానికి గురైన అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







