చైనా నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాల్లో టెన్షన్..

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ చైనా వైపు చూస్తూ చైనా తో ఎంతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఉన్నాయి.

ఎందుకంటే చైనాలో ఇప్పుడు కరోనా కేసులు విచ్చల విడిగా పెరిగిపోతున్న సమయంలో సరిహద్దుల్ని తెరవాలన్నా చైనా ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్ ను నింపుతోంది.

కరోనా వచ్చినా మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా విదేశీ ప్రయాణికులకు సమయం దొరికినట్లు కనిపిస్తూ ఉండడం వల్ల వారు ఎంతో సంబరపడిపోతున్నారు.జనవరి చివరిలో వచ్చే చైనా న్యూ ఇయర్ సంబరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు.

చైనా బుకింగ్ వెబ్సైట్.కామ్ లాంటి వెబ్సైట్లో చాలా దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సాధారణం కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువగా చైనా నుంచి బుకింగ్స్ జరిగాయి.

విదేశాల నుంచి వచ్చే వారికి జనవరి 8 నుంచి క్వారంటైన్‌ నిబంధన ను చైనా తొలగించడంతో చాలా దేశాల్లో ఉన్న చైనా దేశ ప్రజలు స్వాదేశానికి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలను టెన్షన్ లోకి నెట్టేస్తుంది.

Advertisement

ఎందుకంటే చైనా పర్యాటకులతో పాటు కరోనా కూడా మరోసారి ప్రపంచ దేశాల్లోకి వ్యాపిస్తుందేమో అని ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి.దానివల్ల చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని భారత అమెరికా తో పాటు చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి.భారత్ తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇప్పటికే చైనా ప్రయాణికులపై కరోనా పరీక్షలను తప్పనిసరిగా చేశాయి.

అంతే కాకుండా కరోనాకు ముందు వరకు అమెరికాతో పాటు చాలా ఆసియా, యూరప్ దేశాలను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో చైనా దేశ ప్రజల సంఖ్య ఎక్కువగా ఉండేది.అంతేకాకుండా చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్నా వైరస్ అంతమయ్యే ముందు అలాగే విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు త్వరగా కోలుకుంటున్నారని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు మాత్రమే ప్రాణాలను కోల్పోతున్నారని డాక్టర్లు తెలిపారు.

వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..
Advertisement

తాజా వార్తలు