కృష్ణా జిల్లా పామర్రులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.చంద్రబాబు, లోకేష్ లపై మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.
ఆయన ఇంటికి వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు.ఈ క్రమంలో పామర్రు ప్రధాన రహదారిపై టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్ లతో పాటు పలువురును పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







