ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పార్టీ కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
చీకటి జీవో కోసమే కందుకూరు, గుంటూరు సభల్లో ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే జీవో ప్రతులను మాజీ మంత్రి దేవినేని, పార్టీ నేతలతో కలిసి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్నారు.
దేవినేనిని అదుపులోకి తీసుకోవడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో గొల్లపూడి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







