నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత నెలకొంది.గత కొన్ని రోజులుగా ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేస్తున్న ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో పోలీసుల తీరుపై బీజేపీ మోర్చా నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.