సూర్యాపేట జిల్లా: జిల్లాను పచ్చని తివాచీగా మార్చేందుకు మొక్కలు విరివిగా నాటాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవ కార్యక్రమంలో జిల్లాలో గల 475 గ్రామ పంచాయతీ పరిధిలో 556 ప్రాంతాలను గుర్తించి 2,15,976 మొక్కలను నాటామని అన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అటవీ శాతం తక్కువ ఉన్నందున ప్రభుత్వ భూములు,రహదారులు, పాఠశాలలు,కళాశాలల్లో అలాగే కాలువలకు ఇరువైపులా,గృహాల్లో, పారిశ్రామిక వాడల్లో
విరివిగా మొక్కలు నాటాలని,భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు మనవంతు కృషి చేయాలన్నారు.
ఇప్పటికే హరితహారం ద్వారా జిల్లాలో 52 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఉందని అన్ని నర్సరీలలో నాటేందుకు మొక్కలు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు.వాతావరణం సమతూల్యాంగా ఉండాలనే మొక్కలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల సమక్షంలో హరితోత్సవ కార్యక్రమం ఘనంగా చేపట్టామన్నారు.