అప్పుడప్పుడు సెలబ్రెటీలలో( celebrities ) కూడా కొన్ని బ్యాడ్ యాంగిల్స్ కనిపిస్తూ ఉంటాయి.కొన్నిసార్లు జనాలచే విమర్శలు కూడా ఎదుర్కొంటుంటారు.
ఇప్పుడు బిగ్బాస్ అఖిల్ విషయంలో కూడా జనాలు విమర్శలు చేస్తున్నారు.ఆయన పెట్టిన ఫోటోకు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
పైగా తనకొచ్చిన కామెంట్లకు బ్యాడ్ గా రిప్లై ఇవ్వటంతో ఆయనపై మండిపడుతున్నారు.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
బిగ్బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ ( Akhil Sardhak )గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ సీజన్ ఫోర్( Bigg Boss ) పాల్గొని తన యాటిట్యూడ్ తో, తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.ఇక మోనాల్ తో మామూలు ప్రేమాయణం చేయలేదని చెప్పాలి.ఇద్దరు బయటికి వచ్చాక వీడియో కాల్స్, చాటింగులతో బాగా రచ్చ రచ్చ చేశారు.వీరి మధ్య ప్రవర్తన చూసి వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అని ఆ సమయంలో అందరూ అనుకున్నారు.అంతేకాకుండా ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించాలని అనుకున్నారు.
అప్పట్లో ఆ వెబ్ సిరీస్ గురించి కూడా అనౌన్స్ చేశారు.కానీ ఏం జరిగిందో తెలియదు ఆ వెబ్ సిరీస్ అక్కడే ఆగిపోయింది.
అంతేకాకుండా వారిద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చేసింది.ఇక ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్లుగా బ్రతుకుతున్నారు.ఆ తర్వాత అఖిల్.పలు వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు.ఇక అడపా దడపా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఓటీటీ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో అఖిల్ అడుగుపెట్టి ఎంతలా రచ్చ చేశాడో చూసాం.
ఈ షో లో అఖిల్ మునుపటికంటే డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించాడు.ఇక బుల్లితెరపై బీబీ జోడీలో మరో నటి తేజస్వి మదివాడతో జతకట్టి డాన్స్ తో బాగా రచ్చ చేశాడు.
ఇక వీరిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడినట్లు అనిపిస్తుంది.ఇక ఇద్దరూ లవ్ లో ఉన్నారు అని కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి.
కానీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని అఖిల్ ఓసారి చెప్పుకొచ్చాడు.
ఇతడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.నిత్యం తనకు సంబంధించిన ఫొటోస్ బాగా పంచుకుంటూ ఉంటాడు.అయితే తాజాగా తను ఒక ఫోటో పంచుకోగా.
ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఆ ఫోటో డిలీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.చూడ్డానికి ఆ ఫోటోలో అతడు కాస్త బ్యాడ్ గా కనిపించాడు.
దీంతో ఆ ఫోటో చూసిన ఓ నెటిజన్.అఖిల్ ప్యాంటు లో ఏదో ఉంది రా అని కామెంట్ చేయడంతో.
వెంటనే అఖిల్.నీకు ఏముందో నాకు అదే ఉంది బ్రో అంటూ అందరూ ఉన్నారని కూడా చూడకుండా బ్యాడ్ గా రిప్లై ఇచ్చాడు.
ఇక మరికొంతమంది ఆ ఫోటో చూసి అతని అన్ ఫాలో చేసామని అన్నారు.జనాలకు ఆ ఫోటో నచ్చక డిలీట్ చేయమని చెప్పినా కూడా అవేవీ పట్టించుకోకుండా ఆ ఫోటోను అలాగే పెట్టి మరింత ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.
ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.