పెద్దపల్లి జిల్లా గోదావరిఖని( Godavarikhani )లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ మేరకు గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష( Rythu Deeksha )కు ఏర్పాట్లు చేశారు.
అయితే ఈ ఫ్లెక్సీలను చింపి వేసిన గుర్తు తెలియని దుండగులు స్టేజీపై నుంచి కూలర్లను కింద పడేసి ధ్వంసం చేశారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించడంపై పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కావాలనే కొందరు దుండగులు తమను రైతు నిరసన దీక్ష చేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో గోదావరిఖనిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
.