జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత! అమరావతిలో పవన్ పర్యటించే ప్రయత్నం

అమరావతి అసెంబ్లీ సమావేశాలలో ఈ రోజు మూడు రాజధానుల అంశాన్ని అధికార పార్టీ వైసీపీ స్పష్టం చేయడంతో పాటు పరిపాలన రాజధానిని విశాఖగా ప్రకటించేశింది.

ఈ ప్రకటన తర్వాత అమరావతిలో ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులని మోహరించింది.

చట్టంతో ప్రజలని, రైతులని అణచివేసి, ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు అన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.మరో వైపు రాజధాని అమరావతి ప్రాంత రైతులు కూడా ఆందోళనకి సిద్ధం అవుతున్నారు.

ఇదిలా ఉంటే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ ని అమల్లో పెట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జనసేన పార్టీ అత్యవసరం సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మూడు రాజధానుల వ్యవహారంపై చర్చించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం రాజధాని గ్రామాలలో పర్యటించాలని, రైతులకి అండగా నిలబడాలని భావించినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పోలీసులు పెద్ద ఎత్తున మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంకి చేరుకొని పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.అయితే ఈ సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ ఉండటంతో పోలీసులని నిలువరించే ప్రయత్నం చేశారు.

Advertisement

ఈ నేపధ్యంలో మంగళగిరిలో పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అయితే పోలీసు ఆంక్షలని దాటుకొని పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

మరి దీనిపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు