తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం.. ?

దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం చెప్పుకోలేని రీతిలో కొనసాగుతుంది.

ఈ వైరస్ సోకడం ఒకవైపు అయితే కరోనా పేషంట్స్ బ్రతకడానికి చేస్తున్న జీవనపోరాటం ముందు కష్టాలు, దయ అనేది లేకుండా కాచుకు కూర్చున్నాయి.

కరోనాతో మృత్యు అంచులకు వెళ్లిన వారు బ్రతకాలనే ఆరాటంలో చేస్తున్న పోరాటంలో పరిస్దితులు అనుకూలించక అసువులు బాస్తున్న తీరు మనసున్న ప్రతివారిని కంటతడి పెట్టిస్తుంది.ఇక కొన ఊపిరితో పోరాడుతున్న వారికి ఆక్సిజన్ ఎంత విలువైందో అందరికి తెలిసిందే.

ప్రస్తుత పరిస్దితుల్లో సమయానికి ఆక్సిజన్ అందకుంటే ఆ బ్రతుక్కి అర్ధమే మారిపోతుంది.ఇకపోతే తిరుపతి రుయా ఆసుపత్రిలో అత్యంత దయనీయ పరిస్దితులు నెలకొన్నాయట.

ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం తలెత్తడంతో ఐసీయూ వార్డులో దాదాపు 13 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దీంతో రోగుల బంధువులు ఆందోళనకు దిగి, వార్డులో వస్తువులు ధ్వంసం చేశారట.

Advertisement

ఇదిలా ఉండగా చెన్నై నుంచి ఆక్సిజన్ ఆలస్యంగా రావడం వల్లే ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు రుయా ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ రామకృష్ణ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు