హైదరాబాద్ లోని మలక్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతిచెందారు.
వారి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు.తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు బైఠాయించారు.
దీంతో ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







