హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.స్కూల్ రీ ఓపెన్ చేయడంపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల ఎదుట బైటాయించిన బాధిత పేరెంట్స్ నిరసనకు దిగారు.స్కూల్ యాజమాన్యం తమ గోడును వినేందుకు కూడా సిద్దంగా లేదని, కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు.
తమకు సరైన న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడే వరకూ స్కూల్ రీఓపెన్ చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో తెలంగాణ ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది.
అయితే, మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు వినతి మేరకు విద్యార్థులు భవిష్యత్ కోసం స్కూల్ ను రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.







