అమరావతి కాంగ్రెస్ కార్యాలయం( Amaravati Congress Office ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ మేరకు ఇన్ కం ట్యాక్స్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది.
ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
అదేవిధంగా రెండు వైపులా రోడ్లను బారికేడ్లతో మూసివేశారు.

ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ ఇన్ కం ట్యాక్స్ బకాయిలు ఉన్నాయంటూ మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







