అమెరికాలో వర్ణ వివక్ష ఎలా ఉంటుందో చెప్పిన మాజీ టెన్నిస్ స్టార్

అమెరికాలో ఓ నల్లజాతీయుడుని కర్కశంగా హత్యా చేసిన ఉదంతంపై దేశం మొత్తం ఇప్పుడు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి ఘటనలు ఇప్పటికే అమెరికాలో చాలా సందర్భాలలో జరిగాయి.

అక్కడ ఇండియన్స్ మీద కూడా తెల్ల జాతీయులు గతంలో దాడులు చేయడం, హత్యలు చేయడం చేశారు.ఈ జాతి అహంకార దాడులు ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఉన్నాయి.

ఇప్పుడు అగ్రరాజ్యంలో ఈ వర్ణ వివక్షకి వ్యతిరేకంగా జరుగుతున్నా నిరసనలు తరహాలోనే చాలా సార్లు జరిగాయి.అయితే అక్కడ తెల్లజాతీయుల దురంహకారం మాత్రం ఇప్పటికి ఉంది.

ఇక తాజాగా మాజీ టెన్నిస్ స్టార్ జేమ్స్ బ్లేక్ తనకి కూడా అమెరికాలో పోలీసుల నుంచి వర్ణ వివక్ష ఎదురైంది అని తెలియజేశాడు.నల్లజాతీయులు అంటే ఎంత కర్కశంగా వ్యాహరిస్తారో చెప్పుకొచ్చాడు.

Advertisement

ఐదేళ్ల క్రితం యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ సమయంలో ఈ ఘటన జరిగిందని, అది తలచుకుంటే పోలీసుల తీరుపై ఇప్పటికీ వణుకు పుడుతుందని బ్లేక్‌ చెప్పాడు.నేను మన్‌హటన్‌ హోటల్‌ బయట నిల్చున్నాను.

ఒక అభిమాని నా దగ్గరకి వచ్చి నా మ్యాచ్‌ల్ని ఆసక్తిగా చూసేవాడినని చెప్పాడు.తర్వాత కాసేపటికే న్యూయార్క్‌ పోలీసులు నన్ను కర్కశంగా అదుపులోకి తీసుకున్నారు.

క్రెడిట్‌ కార్డు మోసానికి పాల్పడిన వ్యక్తి నాలాగే ఉండటంతో నేనే మోసగాడినని నిశ్చయించుకున్న పోలీసులు నా పెడరెక్కలు విరిచేసి తొక్కిపెట్టేశారు.కనీస నిర్ధారణ అంటూ చేసుకోకుండానే నల్లజాతీయులపై ఈ స్థాయిలో అణచివేత ఉంటుంది’ అని ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్‌ బ్లేక్‌ నాటి భయంకర అనుభవాన్ని వివరించాడు.

వైరల్ వీడియో : వ్యూస్ కోసం యూట్యూబర్ రైల్వే ట్రాక్ పై ఏకంగా..?
Advertisement

తాజా వార్తలు