టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

బాగా గుర్తింపు ఉన్న ఆటలో రాణిస్తే కాసుల వర్షం కురవడం ఖాయం.క్రికెటర్లు, ఫుట్‌బాల్‌ ప్లేయర్లు ధనవంతులు కావడం మనం చూస్తూనే ఉన్నాం.

 Tennis Legend Roger Federer Net Worth Details, Tennis Player, Leander, Sports T-TeluguStop.com

అయితే టెన్నిస్ ఆటలో ఒక స్టార్ ప్లేయర్‌గా రాణించిన రోజర్ ఫెదరర్ ఎవరూ ఊహించని రీతిలో డబ్బు సంపాదించాడు.ఈ స్విట్జర్లాండ్ టెన్నిస్‌ ఆటగాడు రీసెంట్‌గా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పాడు.

కానీ అప్పటికే తన కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లను గెలిచాడు.ఈ ప్లేయర్ వల్లే టెన్నిస్ ఆటకు అందం వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

చాలా కూల్‌గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించాడు.అయితే అభిమానులను మాత్రమే కాదు ఆయన వెనకేసిన ఆస్తులు కూడా చాలా ఎక్కువే.

ప్రస్తుతం రోజర్ ఫెదరర్ వయసు 41 ఏళ్లు.ఈ టెన్నిస్ హీరో తన లైఫ్‌ మొత్తంలో ప్రైజ్‌మనీగా ఏకంగా 13.1 కోట్ల డాలర్లు ఆర్జించాడు.అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.1042 కోట్లు. ఈ ఆస్తి గణాంకాలను ఇటీవల అమెరికన్​ బిజినెస్ మ్యాగజైన్​ వెల్లడించింది.

ఈ స్టార్ 2021లో అత్యధిక డబ్బులు సంపాదించిన క్రీడాకారులలో ఏడవ స్థానంలో నిలిచాడు.గతేడాది ఈ టెన్నిస్ దిగ్గజం రూ.723 కోట్లు సంపాదించాడు.ఇక కమర్షియల్ యాడ్స్ ద్వారా అతను రూ.718 కోట్ల వరకు సంపాదించినట్లు సమాచారం.

Telugu Leander, Rogerfederer, Roger Federer, Teams, Ups, Tennislegend, Tennis-La

రోజర్ ఫెదరర్ చాలా బ్రాండ్స్‌కి అంబాసిడర్​గా వ్యవహరిస్తూ ఉంటాడు.అయితే నైక్​ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్​గా పదేళ్లు ఉండేందుకు గానూ అతను ఏకంగా రూ.1,000 కోట్లు తీసుకున్నాడు.ఇక ఒక్కో ఎగ్జిబిషన్​ మ్యాచ్‌కు ఫెదరర్ దాదాపు రూ.15కోట్లు తీసుకుంటాడట.నివేదికల ప్రకారం, ప్రస్తుతం అతని మొత్తం ఆస్తి విలువ అక్షరాలా రూ.4,382 కోట్లు.టెన్నిస్ ఆటగాడిగా మారిన తర్వాతనే ఈ డబ్బంతా రోజర్ ఫెదరర్ సంపాదించినట్లు చెబుతారు.ఏదేమైనా ఈ స్థాయిలో ఒక టెన్నిస్ ప్లేయర్ సంపాదించడం ఒక్క ఫెదరర్‌కి మాత్రమే చెల్లింది ఏమో అని అందరూ నోరెళ్లబెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube