ఒక పార్టీపై మరో పార్టీలు విమర్శలు చేసుకోవడం ఒకప్పటి మాట.ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పార్టీపై మరో పార్టీ నాయకులు ట్రోల్స్ చేయడం చాలా కామన్ అయ్యింది.
పార్టీని మరియు పార్టీ నాయకుడిని ట్రోల్స్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.తాజాగా తెలుగు దేశం పార్టీపై వైకాపా నాయకుడు ఒకరు విభిన్నమైన ప్రచారం మొదలు పెట్టాడు.
తెలుగు దేశం పార్టీ పేరుతో బీడీలను కడప బీడీ కార్మికులు తయారు చేస్తున్నారు.ఇకపై తెలుగు దేశం పార్టీ భవిష్యత్తు ఇదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
గత రెండు మూడు రోజులుగా వైకాపా వారు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అయ్యింది.తెలుగు దేశం పార్టీ బీడీలు అంటూ సైకిల్ గుర్తు కూడా ఆ బీడీ కట్టలపై వేయడంతో ఆ పార్టీ నాయకులు సీరియస్ అవుతున్నారు.
కడపకు చెందిన అబ్దుల్ ఖాదన్ అనే వ్యక్తి ఈ బీడీలను తయారు చేస్తున్నాడు.వైకాపాకు చెందిన ఆయన తన బీడీలకు ప్రమోషన్ చేసుకునేందుకు ఇలా ప్లాన్ చేశాడు.
పసుపు రంగు కాగితం, దానిపై తెలుగు దేశం పార్టీ, సైకిల్ గుర్తు పెట్టి తన బీడీలను ప్రమోట్ చేసుకుంటున్నాడు.కడప టీడీపీ నాయకులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది.