మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ సినిమా తో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దర్శకుడు వెంకీ అట్లూరి( Venky Atluri ) మొదటి సినిమా తోనే దర్శకుడిగా ప్రతిభావంతుడు అనిపించుకున్న వెంకీ అట్లూరి ఆ వెంటనే అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను అనే సినిమా ని రూపొందించిన విషయం తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిన కూడా అఖిల్ ట్రాక్ రికార్డ్ ని కాస్త గాడి లో పెట్టింది అనడం లో సందేహం లేదు.
ఆ తర్వాత నితిన్ హీరోగా రంగ్ దే అనే సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఆ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ కమర్షియల్ గా నిరాశ పరిచింది.అయితే ఆ సినిమా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది అనడం లో సందేహం లేదు.ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా ధనుష్ హీరో గా సార్ ( Sir Movie ) అనే సినిమా ని రూపొందించిన విషయం తెలిసిందే.తమిళం మరియు తెలుగు లో ద్వి భాష చిత్రంగా రూపొందిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అందుకే ఇక నుండి వరుసగా పరభాష సినిమా లను పర భాష హీరోలను చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

అందులో భాగంగానే దుల్కర్ సల్మాన్( Dulquer Salman ) హీరో గా ఒక సినిమా ను రూపొందించేందుకు దర్శకుడు వెంకీ అట్లూరి రెడీ అవుతున్నాడు అనే సమాచారం అందుతుంది.తెలుగు యంగ్ హీరోలతో పోలిస్తే ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడం చాలా సులభంగా ఉందని వారి యొక్క ఇమేజ్ ని వినియోగించుకుంటూ మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటుందని తెలుగు హీరోల విషయం లో అది జరగడం లేదని వెంకీ అట్లూరి భావిస్తున్నాడట.అందుకే ఇతర భాషల హీరోలతోనే కంటిన్యూ గా సినిమాలు చేయాలని వెంకీ అట్లూరి భావిస్తున్నాడని సమాచారం అందుతుంది.







