ఒకప్పటి ఈ హీరోయిన్ సినిమా అవకాశాలు లేక... చివరికి అలాంటి పాత్రలలో...

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన "చాలా బాగుంది" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన కర్ణాటక బ్యూటీ "మాళవిక" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 కాగా ఈ అమ్మడు అసలు పేరు శ్వేత కున్నుర్.

అయితే మాళవిక సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో అడపాదడపా చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.కానీ ఈ అమ్మడికి ఎక్కువగా తెలుగులో కంటే తమిళంలోనే సినిమా అవకాశాలు రావడంతో టాలీవుడ్ పై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.

అయితే ఒకానొక సమయంలో మాళవికకి చేతి నిండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో ఈ అమ్మడు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన "సుమేష్ మీనన్" అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అయిన తర్వాత ఈ అమ్మడి సినీ జీవితం పూర్తిగా మారిపోయింది.

అప్పటి వరకు హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నటువంటి మాళవిక ఒక్కసారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ కి పడి పోయింది.దీంతో ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధమైంది.

Advertisement

ఈ క్రమంలో అప్పట్లో కొంతమేర బోల్డ్ తరహా పాత్రలలో కూడా నటించింది.అయినప్పటికీ ఈ అమ్మడికి సినిమా అవకాశాలు  వరించక పోవడంతో ఇక 2009వ సంవత్సరంలో నటనకు స్వస్తి పలికింది.

దీంతో ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి మాళవిక కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసం ఉన్నట్లు సమాచారం.అయితే తెలుగులో మాళవిక నటించినటువంటి చాలా బాగుంది, దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా.!, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు