మన చిన్నప్పుడు స్కూల్లో మాస్టారు మన చేతి వ్రాత బాగోలేదని మనల్ని చాలా సార్లు మందలించిన సంఘటనలు చాలానే ఉన్నాయి కదా.చదివింది గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో అలాగే గుర్తుపెట్టుకున్నది పేపర్ మీద అందమైన అక్షరాలతో రాయడం కూడా అంతే ముఖ్యం.
మన చేతి వ్రాత బాగుంటేనే మనకు అదనంగా మార్కులు కూడా వస్తాయి.అయితే ఎంత జాగ్రత్తగా రాసినగాని ఎక్కడో ఒకచోట అక్షర దోషాలు అనేవి రాకుండా ఉండవు కదా.అలాగే మన అందరం మహా అయితే రెండు, మూడు లేదంటే నాలుగు భాషల్లో మాత్రమే రాయడం నేర్చుకుని ఉంటాము.కానీ ఓ యువతి మాత్రం తన రెండు చేతులను ఉపయోగించి ముత్యలాంటి అక్షరాలతో చేతి వ్రాతను రాస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది.
ఏకంగా 21 భాషల్లో తన రెండు చేతులను ఉపయోగించిరాసే మేధా శక్తి తన సొంతం అనే చెప్పాలి.మరి ఆ యువతికి సంబదించిన వివరాలు ఒకసారి తెలుసుకుందామా.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గల వడమాలపేట మండలం, ఓబులరాజు కండ్రిగకు చెందిన సింగరాజు భాస్కర్ రాజు అనే అతనికి ముగ్గురు పిల్లలు.అయితే భాస్కర్ రాజు మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో ఓ స్కూల్ ను స్థాపించి చాలా మంది పిల్లలకు వివిధ రకాల విద్యలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే భాస్కర్ రాజు మొదటి సంతానం అయిన 21 ఏళ్ల సింగరాజు అశ్విని కూడా 21 భాషల్లో ఎంతో ప్రావిణ్యం పొందింది.అశ్విని ఏకంగా 21 భాషలను రెండు చేతులతో అనర్గళంగా రాసేస్తుంది.
ఈ యువతీ మొత్తం 18 భారతీయ భాషలు మరో మూడు విదేశీ భాషలతో కలిపి మొత్తం 21 భాషలను అలవోకగా రాయగలుగుతుంది.ముఖ్యంగా తెలుగు, తమిళం, అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కొంకణి, మరాఠీ, మైథిలి, హిందీ, కన్నడం, మలయాళం, మణిపూరి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, శాంతలి, సింధూ, ఉర్దూతో పాటు విదేశీ భాషలు అయిన ఇంగ్లీష్, నేపాలీ, అరబిక్ వంటి భాషలను కూడా తన రెండు చేతులతో రాయడం నేర్చుకుంది.
ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అశ్వినిలో మరోక స్కిల్ కూడా ఉందండోయ్.
అదేంటంటే ఎంతో కష్టమైన మిర్రర్ రైటింగ్ కూడా అశ్విని ఎంచక్కా రాసేస్తుంది.అలాగే ఇందులో అప్ సైడ్, డౌన్ సైడ్ రైటింగ్ కూడా అశ్వినీ ఏ మాత్రం తడబడకుండా రాస్తుంది.మన దేశంలో కొంతమంది మాత్రమే ఈ మిర్రర్ రైటింగ్ రాయగలరు.
ఒకవేళ అలాంటివాళ్ళు ఉన్నాగాని అప్ అండ్ డౌన్ సైడ్ రైటింగ్ మాత్రం చాలా కష్టం అంటున్నారు మరికొందరు చేతి రాత నిపుణులు.అయితే అశ్విని ప్రధాన లక్ష్యం ఏంటంటే చదువులో వెనుక బడ్డ పిల్లలకు ప్రత్యేక బోధన అందించడమే అశ్విని యొక్క ప్రధాన లక్ష్యం అంట.అలాగే మా నాన్న గారు ఎంతోమంది చిన్నారులకు ముత్యాలు లాంటి అక్షరాలు రాసేలా ట్రైనింగ్ ఇచ్చేవారు ఆయన చేస్తున్న పనికి అకర్షుతురాలినయ్యాను అని అశ్విని చెప్పుకొచ్చింది.ఇలా చేతి వ్రాతలో ప్రావీణ్యం సంపాదించడం వలన జ్ఞాపకశక్తితో పాటు చాలా అవార్డులు, రివార్డులు అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు అశ్విని.